Header Banner

తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత..! దేవినేని అవినాష్ అరెస్ట్!

  Tue May 20, 2025 18:14        Politics

తిరువూరులో (Tiruvuru) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కవ్వించే విధంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్‌ వ్యవహరించారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు అనుచరగణంతో విజయవాడ నుంచి తిరువూరు వచ్చారు దేవినేని అవినాష్. విషయం తెలిసిన వెంటనే దేవినేని అవినాష్‌ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్రస్దాయిలో వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రేపూడి వద్ద దేవినేని అవినాష్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో అవినాష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.

తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ నుంచి తిరువూరు వచ్చిన దేవినేని అవినాష్.. వైసీపీకి చెందిన కొంత మంది సభ్యులను ఎన్నికకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు, సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ స్వచ్ఛందంగా వస్తున్న సభ్యులను అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. దేవినేని అవినాష్ తన అనుచరగణంతో వస్తున్నట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దేవినేని అవినాష్‌ను రోడ్డు మీదే అడ్డుకుని.. వెనక్కి వెళ్లాల్సిందిగా తెలుగు దేశం శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. దేవినేని అవినాష్‌తో పాటు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత ఇరువురిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

టీడీపీకి సంఖ్యా బలం లేకుండా పోటీకి దిగారని, ఇది ఎలా సాధ్యమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్నారని, ఎన్నికకు వస్తున్న వారిని అడ్డుకుని దాచిపెడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా.. తిరువూరులో ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తిరువూరు పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తును కల్పించారు. మరోవైపు.. తిరువూరు నగర పంచయతీ ఉప ఎన్నిక ఈరోజు కూడా కోరం లేక వాయిదా పడింది. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఉన్నతాధికారులను అడిగి వెల్లడిస్తామని ఆర్డీవో మాధురి ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TiruvuruTension #DevineniAvinash #PoliticalClash #AndhraPolitics #BreakingNews #YSRCP #TDP